బాయికాడి మల్లయ్య దగ్గర నుంచి ఎదురింటి పటేల్ వరకు అందరికీ ఫోన్లేనాయే. ఎక్కడ చూసినా హలో హలో ముచ్చట్లే. సిటీలో అయితే చిన్న స్థాయి కార్మికుడి నుంచి పెద్ద మేనేజర్ వరకు అందరికీ స్మార్ట్ ఫోన్లు. తలకాయ బయటపడదు… చూపులు పైకి ఎక్కవు. అంతగా మొబైల్స్ రాజ్యమేలుతున్నాయి. రాష్ట్ర జనాభాను మించి మొబైల్ కనెక్షన్లు ఉన్నాయంటే.. ఆశ్చర్యపడక తప్పదు. రాష్ట్రంలో 3.52 కోట్ల జనాభా ఉండగా మొబైల్ కనెక్షన్లు 3.66 కోట్లు ఉన్నాయి.
రాష్ట్ర అర్థ గణాంక శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో రాష్ట్రంలోని సమాచార కమ్యూనికేషన్ల వ్యవస్థను విశ్లేషించింది. రాష్ట్రంలోని మొబైల్ కనెక్షన్లలో మూడో వంతు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 83,03,612 కుటుంబాలు ఉండగా 3.66 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి కుటుంబంలో నలుగురు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.ల్యాండ్‌ఫోన్‌లు 6.24 లక్షలు: రాష్ట్రంలో 6,24,224 ల్యాండ్‌ఫోన్‌లు ఉన్నాయి. వీటికోసం 1314 టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లు పనిచేస్తున్నాయి. 13, 223 పబ్లిక్ టెలిఫోన్లు ఉండగా వీటిలో సగం కంటే ఎక్కువ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఈ రెండుజిల్లాల్లో ఉన్న పీసీవోల సంఖ్య 8,220.
No comments:
Post a Comment